![]() |
![]() |
.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ వారం డెలివరీ బాయ్స్ కి డేడికేట్ చేశారు. ఇక ఇందులో సెలబ్రిటీస్ కి అలాగే డెలివరీ బాయ్స్ కి మధ్య టగ్ ఆఫ్ వార్ గేమ్ పెట్టారు. ఇక సౌమ్య శారద ఐతే ఒక రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసింది. "అర చేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేవు. బాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ని ఆపలేవు అని డైలాగ్ కొట్టినా మేడం రీసెంట్ గా ఒక పరీక్షను ఆపేసారు" అంటూ కామెడీగా చెప్పాడు ఒక డెలివరీ బాయ్. ఇక ఇదే డెలివరీ బాయ్ తన ఇల్లు రేకులు ఇల్లు అని వర్షం వస్తే స్విమ్మింగ్ ఫూల్ అవుతుంది అని చెప్పాడు. రీసెంట్ గా ఒక ప్రోగ్రాంకి ట్రై చేశానని డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందామని అనుకున్నట్లు చెప్పాడు. అక్కడ కూడా సక్సెస్ కాలేదు అని చెప్పాడు. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని గుర్తు చేసుకుంటూ కొన్ని సాంగ్స్ ని పాడారు సింగర్స్.
తర్వాత ఫుడ్ డెలివరీ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒక స్కిట్ రూపంలో చేసి చూపించారు. ఈమధ్య కాలంలో ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం..అమ్మాయిలు ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తుంటే అక్కడ వాళ్లకు ఎదురయ్యే అవమానాలు. అలాగే అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తే కస్టమర్స్ ని నుంచి వచ్చే మాటలు వీటన్నిటినీ ఆ స్కిట్ లో చూపించారు. ఇక ఫుడ్ డెలివరీ జాబ్ చేసే అమ్మాయి లేచి ఇలా ఫుడ్ డెలివరీ చేస్తున్నాను అన్న విషయాన్నీ ఎప్పుడూ పేరెంట్స్ తో షేర్ చేసుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. "ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చారంటే కచ్చితంగా వాళ్ళ ఇల్లు గడవని పొజిషన్ లో ఉన్నారని నా అభిప్రాయం" అంటూ ఆది చెప్పుకొచ్చాడు. ఇక ఒక డెలివరీ బాయ్ ఐతే "ఒక్కో కస్టమర్ డ్రింక్ లో ఉంటారు. డబ్బులు ఇవ్వకుండా అవస్థలు పెడతారు" అంటూ చెప్పుకొచ్చాడు. "ఈరోజున మనుషులెవ్వరూ మీతో మాట్లాడడం లేదు. మీ డబ్బులతో మీ హోదాతో మాట్లాడుతున్నారు." అంటూ చెప్పుకొచ్చింది రోజా. ఇక ఆది ఐతే ప్లేట్ లో బిర్యానీ తెచ్చి "ఎన్నోసార్లు మీరు టైంకి మా ఆకలి తీర్చారు. ఈరోజు మీ అందరి ఆకలి మొత్తం తీర్చలేకపోయినా మీ అందరితో ఈ బిర్యానీని షేర్ చేసుకుంటాను" అంతో అందరికీ కలిపి ముద్దలు స్వయంగా తినిపించాడు ఆది. "అమ్మ చేతి ముద్దు ఆది అన్న ముద్ద జీవితాంతం మర్చిపోను" అని ఒక డెలివరీ గర్ల్ చెప్పింది.
![]() |
![]() |